CCL NORMS IN TELUGU

 

మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు ఇప్పటి వరకు సంఘాల యొక్క ప్రాతినిధ్యంతో క్రింద తెలుప బడిన ప్రత్యేక సెలవులు(సి.యల్స్ & స్పెషల్ సి.యల్స్ (15+7) కాకుండా) సాధించుకొని వినియోగించు కొనుచున్నాము.

 

1 ప్రమాతి సెలవులు                             : 180 రోజులు (జి.ఓ.యం.యస్.నెం. 152, తేది. 04/05/2010)

2. అబార్షన్ సెలవులు                           : 42 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.219, తేది. 25/06/1984)

3.ట్యూనిక్టమీ ఆపరేషన్ సెలవులు       : 14 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.1415, తేది. 10/06/1968)

4. విశావలైజేషన్ ఆపరేషన్ సెలవులు : 21 రోజులు (జి.ఓ.యం.యస్.నెం. 102, తేది. 19/02/1981)

5. గర్భనిరోధక సాధనం(లూప్)            : 01 రోజు (జి.ఓ.యం.యస్. నెం. 102, తేది. 19/02/1981)

అమర్చుటకు

6. గర్భసంచి తొలగింపు హిస్టారిక్షమీ   : 45 రోజులు (జి.ఓ.యం.యస్.నెం.152, తేది. 0904/2011)

   ఆపరేషన్ సెలవులు

7. మహిళా దినోత్సవము (మార్చి, 8)       : 01 రోజు  (జి.ఓ.యం.యస్.నెం. 433, తేది. 04/08/2010)

8.ముహిళా ఉపాధ్యాయినీలకు             :  05 రోజులు (జి.ఓ.యం.యస్.నెం. 374, తేది. 16/03/1996)

ప్రత్యేక సెలవులు

 

     పై విధంగా ప్రత్యేక సెలవులతో పాటుగా ప్రస్తుత 10వ పి.ఆర్.సి. ప్రతిపాదనలు అనుగుణంగా సర్వీసు మొత్తములో పిల్లలను పెంచు నిమిత్తము లేక పాఠశాల& కాలేజి స్థాయి పరీక్షల సమయంలోనూ, వారి ఆనారోగ్య సమయంలలో, వగైరాలకు 2నెలలు (60 రోజులు) వరకు శిశు సంరక్షణ సెలవులు క్రిందతెలుపబడిన నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినది. ఈ సదుపాయము మహిళా ఉద్యోగులకు ఒక వరంగా భావించుటలో అతిశయోక్తి లేదు.

 

1. ఈ సెలవులను 3సార్లు తగ్గకుండా ఇద్దరి పిల్లల యొక్క వయస్సు 18 సం॥ల లోపు వరకు మరియు ఆశక్తులైన పిల్లల యొక్క (మానసిక/శారీరక వికలాంగులు) వయస్సు 22 సం||లలోపు వరకు ఎన్నిసార్లు అయిననూ వినియోగించు కొనవచ్చు.

2. సెలవులను యల్.టి.సి. నిమిత్తంగా వాడుకొనుటకు అవకాశము లేదు.

3. ఈ సెలవులు వినియోగించుకొనిన వివరాలు జి.ఓ నందు పొందు పరచబడిన సంబంధిత ప్రాఫార్మా ప్రకారంగా ఇ.యల్స్ మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు మాదిరిగా సర్వీసు రిజిష్టరు నందు నమోదు పరచుకొనవలెను.

4. ఈ సెలవులు ఇ.యల్స్ మరియు ఆర్ధజీతపు సెలవుల అకౌంటు నుండి తగ్గించబడవు.

5. ఈ సెలవులు కార్యాలయము/సంస్థ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందు లేకుండా మాత్రమే వినియోగించుకొనవలెను.

6. ఈ సెలవులు వినియోగించుకొనుట హక్కుగా భావించరాదు. మంజూరు చేయు అధికారిని ముందుగానే అనుమతి తీసుకొని మాత్రమే వినియోగించుకొనవలెను.

7. ఈ సెలవులు సంపాదిత సెలవులుగానే పరిగణించాలి.

8. ఈ సెలవులు ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకొని అనగా సి.యల్స్ & స్పెషల్ సి.యల్స్ కాకుండా వినియోగించుకొనవచ్చు.

 9. ఉద్యోగిని యొక్క ప్రాబేషన్ కాలము నందుకూడా వినియోగించుకొనవచ్చు కాని సదరు కాలము వరకు ప్రొబేషన్ కాలము పాడిగించబడును.

 10. ఈ సెలవులను లీవ్ నాట్ - డ్యూగా అవకాశము కలదు.

Click here for || Document DOWNLOAD

0 Comments:

Post a Comment

SCHOOL EDUCATION

Subscribe My Whatsapp Group

Advertisement

NADU NEDU

MID DAY MEAL

CONTRACT/OUT SOURCING INFO

IMPORTANT WEB SITES

LATEST/GENERAL INFORMATION

OTHER NEWS

JOBS/RESULTS/NOTIFICATIONS

Contact Me

Name

Email *

Message *

Subscribe Now

Enter your email address:

Delivered by FeedBurner

JOIN GROUPS

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Top